Tithra Tithraతిత్ర తెలుగు పంచాంగం

తిత్ర తెలుగు పంచాంగం

మన సంప్రదాయం…
మన దైనందిన దిక్సూచి

తిథి, నక్షత్రం, రాహుకాలం, ముహూర్తాలు, పండుగలు, రాశి ఫలాలు, AI జ్యోతిష్యం — ప్రతి రోజూ మీ ఫోన్‌లో, పూర్తిగా తెలుగులో.

గమనిక: యాప్ ప్రస్తుతం 12 మంది testersతో 14 రోజుల testingలో ఉంది. త్వరలో Google Playలో విడుదల — విడుదల కాగానే ఇక్కడే లింక్ పెడతాం.

యాప్ హోమ్ — ఈరోజు తిథి, నక్షత్రం, రాహుకాలం
తిథి
విదియ
రాహుకాలం
09:07 – 10:41
రిమైండర్
పండుగ దగ్గరపడింది
పూర్తిగా తెలుగులోఅనువాదం కాదు — తెలుగు వాళ్ళ కోసం
ఇంటర్నెట్ లేకున్నాపంచాంగం లెక్క ఫోన్‌లోనే జరుగుతుంది
మీ ఊరికి తగ్గట్టుమీరు ఎక్కడ ఉంటే ఆ ప్రాంత సమయాలు
95% ఉచితంరోజువారీ పంచాంగం అంతా ఉచితమే

యాప్ లోపల

చూడగానే అర్థమయ్యేలా

ఎక్కడా వెతకనవసరం లేదు — కావాల్సినవి మొదటి స్క్రీన్‌లోనే.

హోమ్ స్క్రీన్
ఈరోజు ఒక్క చూపులో
శుభ ముహూర్తం ఫలితాలు — ఒకే ముహూర్త సమయం
శుభ ముహూర్తం
WhatsApp Status పోస్టర్ — మీ ఫోటో, పేరుతో
WhatsApp పోస్టర్లు
AI జ్యోతిష్యం
AI జ్యోతిష్యం

పంచాంగం కోసం ఇంకెవరినీ అడగనవసరం లేదు

మంచి రోజు ఏదో, రాహుకాలం ఎప్పుడో, పండుగ ఏ రోజో — ఫోన్ తీస్తే చాలు.

☀

ఈరోజు అంతా ఒక్క చోట

తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం, సూర్యోదయం–సూర్యాస్తమయం, చంద్రోదయం.

⏳

మంచి–చెడు వేళలు

రాహుకాలం, యమగండం, గుళిక, దుర్ముహూర్తం, వర్జ్యం, అమృత ఘడియలు — సమయాలతో సహా.

🔔

మర్చిపోయే భయం లేదు

పండుగలు, వ్రతాలు, ఏకాదశి, ప్రదోషం — ముందుగానే రిమైండర్.

ఎలా వాడాలి

మూడు అడుగులు, అంతే

1

మీ ఊరు ఎంచుకోండి

సూర్యోదయం, రాహుకాలం, ముహూర్తాలు — ఇవన్నీ ప్రాంతాన్ని బట్టి మారతాయి. ఒకసారి ఊరు పెట్టుకుంటే, ఆ తర్వాత ప్రతి లెక్క మీ ఊరికే.

  • ఇంటర్నెట్ లేకున్నా లెక్క ఫోన్‌లోనే
  • ప్రయాణంలో ఉంటే ఊరు మార్చుకోవచ్చు
యాప్ ప్రారంభ స్క్రీన్
2

ఈరోజు పంచాంగం చూడండి

తెరిచిన వెంటనే ఈరోజు తిథి, నక్షత్రం, రాహుకాలం కనిపిస్తాయి. కిందకి జరిపితే పూర్తి పంచాంగం — యోగం, కరణం, చంద్ర–సూర్య సమయాలతో.

  • నిన్న–రేపు కూడా ఒక్క తట్టుతో
  • WhatsApp Status కోసం ఈరోజు పంచాంగం పంచుకోవచ్చు
పూర్తి పంచాంగం స్క్రీన్
3

మిగతావన్నీ లోపలే

క్యాలెండర్, పండుగలు, రాశి ఫలాలు, AI జ్యోతిష్యం, వ్రతాలు, పూజా విధానాలు, స్తోత్రాలు — వేరే యాప్ అవసరం లేదు.

  • నెలంతా ఒక్క చూపులో — పండుగలు, ఉపవాస రోజులు
  • ఫైనాన్స్ సాధనాలు — EMI, GST, వడ్డీ, జీతం, క్యాష్ కౌంటర్
సేవలు చూడండి
సేవలు స్క్రీన్

యాప్‌లో ఉన్నవి

ఒకే యాప్, రోజంతా అవసరమయ్యేవి

📅

తెలుగు క్యాలెండర్

తెలుగు మాసాలతో కూడిన నెలవారీ క్యాలెండర్

🎉

పండుగలు

పండుగలు, ప్రభుత్వ సెలవులు, ముఖ్యమైన రోజులు

⭐

రాశి ఫలాలు

రోజువారీ రాశి ఫలితాలు, 12 రాశులకూ

✨

నక్షత్ర ఫలాలు

మీ జన్మ నక్షత్రం ప్రకారం ఫలితాలు

💬

AI జ్యోతిష్యాన్ని అడగండి

మీ సందేహాలకు తెలుగులో సమాధానాలు

🪔

వ్రతాలు & పూజలు

ఏ వ్రతం ఎప్పుడు, ఎలా చేయాలో

📖

స్తోత్రాలు & శ్లోకాలు

నిత్య పారాయణకు, తెలుగు భావంతో

🧮

ఫైనాన్స్ సాధనాలు

EMI, GST, వడ్డీ, జీతం, క్యాష్ కౌంటర్

🪷

శుభ ముహూర్తాలు

వివాహం, గృహప్రవేశం, నామకరణం సహా 9 కార్యక్రమాలు

📜

లగ్న పత్రిక

సంప్రదాయ ముహూర్త పత్రిక — PDF & WhatsApp

🖼

WhatsApp పోస్టర్లు

ఈరోజు పంచాంగం, పండుగ శుభాకాంక్షలు — మీ ఫోటో, పేరుతో

◈

జాతకం PDF

జన్మ వివరాలతో జాతకం — 2 పేజీల PDF

శుభ ముహూర్తం

అయ్యగారిలా ఒకే సమయం —
పత్రికతో సహా

వివాహం నుండి వాహన పూజ వరకు — వివరాలు ఇస్తే పంచాంగ నియమాల ప్రకారం శుభ తేదీలు, ఒక్కో తేదీకి ఒకే ముహూర్త సమయం.

  • 9 కార్యక్రమాలు — వివాహం, నిశ్చితార్థం, గృహప్రవేశం, శంకుస్థాపన, నామకరణం, అన్నప్రాశనం, వాహన పూజ, విద్యారంభం, వ్యాపార ప్రారంభం
  • తొమ్మిది శుద్ధులు — మాసం, తిథి, వారం, నక్షత్రం, యోగం–కరణం, చంద్ర బలం, గురు–శుక్ర బలం, రాహుకాలం–వర్జ్యం, లగ్నం
  • లగ్న పత్రిక / ముహూర్త పత్రిక — యాప్‌లోనే చూసి, PDF గా సేవ్ చేసి, WhatsApp లో పంపవచ్చు
ముహూర్తాల గురించి చూడండి
తిత్ర యాప్ తయారు చేసిన వివాహ లగ్న పత్రిక — వధూవరుల వివరాలు, ముహూర్తం, లగ్నం, నివారించాల్సిన సమయాలు

యాప్ తయారు చేసే వివాహ లగ్న పత్రిక (నమూనా వివరాలతో)


AI జ్యోతిష్యం స్క్రీన్

AI జ్యోతిష్యం

మీ ప్రశ్నలకు
జ్యోతిష్య మార్గదర్శకం

జన్మ వివరాలు ఇస్తే — లగ్నం, గ్రహస్థితులు, దశలు చూసి తెలుగులో సమాధానం. అడగాలనుకున్నది నేరుగా అడగవచ్చు.

  • AI జ్యోతిష్యాన్ని అడగండి — మీ సందేహాలకు సమాధానాలు
  • రాశి ఫలాలు — రోజువారీ ఫలితాలు
  • నక్షత్ర ఫలాలు — మీ జన్మ నక్షత్రం ప్రకారం
  • జీవిత విశ్లేషణలు — జాతక పొంతన, వివాహ యోగం, కెరీర్, ధనం
  • హస్త సాముద్రికం & ముఖ లక్షణాలు — సాముద్రిక శాస్త్ర వివరణ
AI జ్యోతిష్యం చూడండి

మీరు అడిగే ప్రశ్నలు

యాప్ ఇప్పుడు Google Playలో ఉందా?

లేదు. ప్రస్తుతం 12 మంది testersతో 14 రోజుల testing జరుగుతోంది. Google Play విడుదల కాగానే ఈ పేజీలోనే లింక్ పెడతాం.

ఇంటర్నెట్ లేకపోతే పనిచేస్తుందా?

పంచాంగం లెక్క ఫోన్‌లోనే జరుగుతుంది — ఇంటర్నెట్ అవసరం లేదు. AI జ్యోతిష్యం వంటి కొన్నింటికి మాత్రం ఇంటర్నెట్ కావాలి.

సమయాలు నా ఊరికి సరిపోతాయా?

అవును. మీరు ఎంచుకున్న ప్రాంతం ప్రకారం సూర్యోదయం, రాహుకాలం, ముహూర్తాలు లెక్కిస్తుంది.

ఏ పంచాంగం ఆధారంగా ఉంటుంది?

దృక్ సిద్ధాంత గణితం ఆధారంగా — ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల తెలుగు పంచాంగ పద్ధతిలో.

నా వివరాలు ఎక్కడికైనా వెళ్తాయా?

పంచాంగం లెక్కకు కావాల్సినవన్నీ ఫోన్‌లోనే ఉంటాయి. వివరాల కోసం గోప్యతా విధానం చూడండి.

యాప్ ఉచితమేనా?

అవును. పంచాంగం, క్యాలెండర్, పండుగలు, ఫలాలు, WhatsApp పోస్టర్లు ఉచితం. ముహూర్తాల్లో ఉత్తమ తేదీ, జాతకం సారాంశం కూడా ఉచితమే; మిగతా తేదీలు, పూర్తి విశ్లేషణలు ఒక చిన్న వీడియో చూసి ఉచితంగా తెరుచుకోవచ్చు, లేదా Premium తో యాడ్స్ లేకుండా అన్నీ ఒకేసారి.

ముహూర్తం పురోహితుడు ఇచ్చినంత ఖచ్చితమేనా?

పురోహితులు చూసే తొమ్మిది శుద్ధుల ప్రకారమే యాప్ లెక్కిస్తుంది, ఒక్కో తేదీకి ఒకే సమయం ఇస్తుంది. అయినా ఇది మార్గదర్శనం మాత్రమే — వివాహం వంటి ముఖ్య కార్యాలకు మీ కుటుంబ పురోహితుని సలహా తప్పకుండా తీసుకోండి.

ఖర్చు గురించి

ఉచితంగా మొదలు

రోజువారీ పంచాంగం, క్యాలెండర్, పండుగలు, రాశి ఫలాలు, నక్షత్ర ఫలాలు, వ్రతాలు, స్తోత్రాలు, ఫైనాన్స్ సాధనాలు, WhatsApp పోస్టర్లు — ఇవన్నీ ఉచితమే.

వీడియో చూసి ఉచితంగామరో ముహూర్త తేదీ, పూర్తి జాతకం, లోతైన విశ్లేషణ — ఒక్కొక్కటి ఒక చిన్న వీడియోతో
Premiumయాడ్స్ లేకుండా అన్ని ముహూర్తాలు, పూర్తి జాతకం & విశ్లేషణలు, ఎక్కువ AI ప్రశ్నలు

ఏది తెరవాలో మీరే ఎంచుకుంటారు — బలవంతం ఏమీ లేదు.

త్వరలో మీ ఫోన్‌లో

విడుదల కాగానే ఇక్కడే Google Play లింక్ కనిపిస్తుంది.

త్వరలో Google Playలో

గమనిక: యాప్ ప్రస్తుతం Google Play Storeలో అందుబాటులో లేదు. 12 మంది testersతో 14 రోజుల testing జరుగుతోంది.

Tithra నుంచి మరొకటి

వీడియో ఎడిటింగ్ కూడా చేస్తారా?

Tithra Auto Edit — మీ వాయిస్ ఓవర్‌కి తగ్గట్టు వీడియోను ఆటోమేటిక్‌గా ఎడిట్ చేసే Windows యాప్.

🎬 Video Auto Edit చూడండి